: మంచి రివ్యూలు వస్తున్నాయి.. ఆనందంలో మునిగి తేలుతున్నా: సమంత


అందాల భామ సమంత ఆనందంలో మునిగితేలుతోంది. నాగచైతన్య నటించిన 'ప్రేమమ్' సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. 'మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కేకలు వేస్తాం లేదా ఏడుస్తాం లేదా నవ్వుతాం లేదా గంతులేస్తాం. కానీ, ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తుండటంతో నేను వీటన్నిటినీ కలిపి చేస్తున్నా'నంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు, ప్రేమమ్ అనే హాష్ ట్యాగ్ ను కూడా జత చేసింది. తనకు కాబోయే భర్త సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తనకుందని నిన్న కూడా ట్వీట్ చేసింది సమంత.

  • Loading...

More Telugu News