: కొలంబియా అధ్యక్షుడికి నోబెల్ శాంతి పురస్కారం


ప్రతిష్ఠాత్మక నొబెల్ శాంతి బహుమతిని ఈ రోజు ప్రకటించారు. ఈ ఏడాది ఈ పురస్కారాన్ని కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యూల్ సాంతోస్ కు అందజేయనున్నారు. కొలంబియాలో అంతర్యుద్ధ నివారణకు జువాన్ మాన్యూల్ సాంతోస్ చేసిన కృషికిగాను నోబెల్ శాంతి పురస్కారం అందజేయనున్నట్టు కమిటీ తెలిపింది. కాగా, 2010 ఆగస్టు 7న కొలంబియా అధ్యక్షుడిగా జువాన్ మాన్యూల్ సాంతోస్ పగ్గాలు చేపట్టారు. కొలంబియాలో అంతర్యుద్ధం నివారణకు ఆయన విశేషమైన కృషిచేశారు. దీంతో ఆయనను నోబెల్ శాంతి పురస్కారం వరించింది.

  • Loading...

More Telugu News