: పాకిస్థాన్ బోలన్ జిల్లా వద్ద జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లు


పాకిస్థాన్‌లోని బోలన్ జిల్లా వద్ద జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈరోజు బాంబు పేలుళ్లు సంభ‌వించాయి. ట్రైన్‌ క్వెట్టా నుంచి రావ‌ల్పిండి వెళుతుండ‌గా ఈ పేలుళ్లు జరిగాయి. పేలుడు ధాటికి నలుగురు మృతి చెంద‌గా, మ‌రో 13 మందికి గాయాలయ్యాయి. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న రెస్క్యూ టీమ్ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  • Loading...

More Telugu News