: బ్రెగ్జిట్ తరువాత అతిపెద్ద పతనం... 31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన బ్రిటన్ కరెన్సీ


బ్రిటన్ కరెన్సీ భారీగా పతనమైంది. డాలర్ తో స్టెర్లింగ్ పౌండ్ మారకపు విలువ శుక్రవారం నాడు 1.2450 డాలర్లకు పడిపోయింది. ఇది 31 సంవత్సరాల కనిష్ఠ స్థాయి. 1985 తరువాత పౌండ్ విలువ ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. 2019 నాటికి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగుతుందని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే, టైంటేబుల్ ను ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పౌండ్ తో రూపాయి మారకపు విలువ గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం పౌండ్ విలువ రూ. 82.57 వద్ద కొనసాగుతోంది. గడచిన జూన్ లో యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ ప్రజలు తీర్పిచ్చిన తరువాత, పౌండ్ స్టెర్లింగ్ భారీగా పతనమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News