: పిల్లలు కాల్చిన దీపావళి బాణసంచా పేలుళ్లు నావికా దళాన్ని ఉరుకులెత్తించాయి!


గుజరాత్ లోని పోర్ బందర్ సమీపంలో ఉన్న భారత నావికాదళ కేంద్రంలో వినిపించిన పేలుళ్లు దీపావళి బాణసంచావని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉదయం నావెల్ బేస్ లో వినిపించిన భారీ శబ్దాలు కొంతమంది పిల్లలు ఫైర్ క్రాకర్స్ కాలిస్తే వచ్చినవేనని నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. యూరీ దాడి, ఆపై సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత, గత వారం నుంచి నేవీ బేస్ లో భద్రతను పెంచామని వెల్లడించింది. ఈ వారం ప్రారంభంలో పోర్ బందర్ సమీపంలో 9 మందితో ఉన్న పాక్ బోటు పట్టుబడటం, ఆపై నేడు పేలుడు శబ్దాలు వినిపించడంతో తీవ్ర కలకలం రేగగా, పోలీసులు, సైన్యం ఉరుకులు, పరుగులపై ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆఖరికి విషయం తెలుసుకుని నేవీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News