: రాహుల్ ను జయలలిత వద్దకు వెళ్లడానికి అనుమతించని అధికారులు... దేవుడిని ప్రార్థిస్తున్నానన్న రాహుల్!


గడచిన 16 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిరాశే ఎదురైంది. అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా రాహుల్ కు స్వాగతం పలికి లోపలికి తీసుకు వెళ్లినా, ఆయన్ను జయలలిత వద్దకు తీసుకువెళ్లేందుకు అధికారులు అంగీకరించలేదు. ఆమెను చూసేందుకు వీల్లేదని స్పష్టం చేయడంతో, ఆమె ఆరోగ్యం, ఏమైందని మాత్రమే రాహుల్ అడిగి తెలుసుకుని బయటకు వచ్చారు. జయలలిత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు మీడియాకు చెప్పిన రాహుల్ ఆపై వెళ్లిపోయారు. కాగా, ఆమెకు సుదీర్ఘకాలం పాటు చికిత్స అవసరమని, అది ఎన్నాళ్లన్నది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు రాహుల్ కు చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News