: చెన్నైకి రాహుల్ గాంధీ... అమ్మ క్షేమ సమాచారం కోసమే!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైకి రానున్నారు. మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చే ఆయన, సరాసరి అపోలో ఆసుపత్రికి వెళ్లి ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించనున్నారు. రెండు వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నప్పటికీ, ఆమెకు ఏమైందన్న విషయంలో సరైన సమాచారం ఇంతవరకూ బయటకు రాని సంగతి తెలిసిందే. మేనకోడలు, దత్త పుత్రుడికి కూడా జయలలితను చూసేందుకు అనుమతి లభించక పోగా, ఆసుపత్రి బయట వేలాది మంది ఏఐఏడీఎంకే కార్యకర్తలు అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ, పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జయలలిత స్వయంగా శ్వాస పీల్చుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తున్నారు.