: ఎక్కడైనా, ఏ క్షణమైనా ఉగ్రదాడి... 22 విమానాశ్రయాలకు ఐబీ హెచ్చరిక


ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 22 విమానాశ్రయాలపై ఉగ్రవాదులు ఏ క్షణమైనా దాడి చేయవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ విమానాశ్రయాలకు భద్రతను మరింతగా పెంచాలని సూచించాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీల్లోని 22 ఎయిర్ పోర్టులకు ఈ హెచ్చరికలు అందాయి. ఈ నాలుగు రాష్ట్రాల పోలీసు చీఫ్ లకు, వీటి భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్, పారా మిలటరీ దళాలకు కూడా సమాచారాన్ని అందించాయి. ముఖ్యంగా బ్యాగేజీ కౌంటర్లు, పార్కింగ్ ప్రాంతాలపై మరింత సునిశిత దృష్టిని సారించాలని ఐబీ అధికారులు సూచించారు. ఈ పండగ సీజన్ లో విధ్వంసం సృష్టించాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని చెబుతూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐబీ ఆదేశించింది.

  • Loading...

More Telugu News