: స్కూలుకు వెళ్లలేదని కుమార్తెను చితకబాదిన తండ్రి, చిన్నారి మృతి.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన


కుమార్తె స్కూలుకు వెళ్లలేదని చిన్నారి అని కూడా చూడకుండా ఆమెను గొడ్డును బాదినట్టు బాదాడో తండ్రి. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామసింగవరం గ్రామానికి చెందిన బాలిక స్థానికంగా ఐదో తరగతి చదువుతోంది. అయితే గత నెల 22న బాలిక పాఠశాలకు వెళ్లకపోవడంతో ఆగ్రహించిన తండ్రి ఆమెను గొడ్డును బాదినట్టు బాదాడు. తండ్రి దెబ్బలకు తాళలేని చిన్నారి తీవ్ర గాయాలతో మృతి చెందింది. కుమార్తె మృతదేహాన్ని తండ్రి రాజారత్నం రహస్యంగా ఖననం చేశాడు. అయితే కొన్ని రోజులుగా బాలిక కనిపించకపోవడంతో ఆమె గురించి రాజారత్నంను స్థానికులు గట్టిగా నిలదీశారు. దీంతో జరిగింది చెప్పడంతో గ్రామస్థులు నిశ్చేష్టులయ్యారు. బాలిక తల్లి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News