: పార్ట్ టైం పాలిటిక్స్ కు కాలం చెల్లింది: చంద్రబాబు
పార్ట్ టైం పాలిటిక్స్ కు కాలం చెల్లిందని, నిరంతరం ప్రజల్లో ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ నాయకత్వ సాధికారత వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, మీ పనుల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండకుండా చూసుకోవాలని, గత ఎన్నికల్లో మనకు మద్దతు ఇవ్వని వర్గాలు కూడా ప్రస్తుతం మన సంక్షేమ కార్యక్రమాలతో చేరువవుతున్నాయని అన్నారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.