: జయలలిత కోలుకుంటున్నారు.. హెల్త్ బులెటిన్ విడుదల!
కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న తమిళనాడు సీఎం జయలలితకు సంబంధించిన హెల్త్ బులెటిన్ ను చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. జయలలిత కోలుకుంటున్నారని, మరికొన్ని రోజుల పాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. జయలలితకు షుగర్, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స, కొన్ని పరీక్షలతో పాటు స్కానింగ్ కూడా నిర్వహించామని ఆ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.