: సీనియారిటీ ప్రాతిపదికన కొత్త జిల్లాల అధికారుల నియామకం జరగాలి: సీఎం కేసీఆర్ ఆదేశం
కొత్త జిల్లాల అధికారుల నియామకం సీనియారిటీ ప్రాతిపదికన జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష సమావేశం ముగిసింది. ప్రతిశాఖలో విభాగాధిపతుల నియామకం వెంటనే జరపాలని, ఉద్యోగుల నియామకాలకు ప్రతిపాదనలు పంపాలని, ఉద్యోగుల పని స్వభావాన్ని బట్టి ఎక్కడికైనా బదిలీ చేసేలా నిబంధనలు ఉండాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ పనిభారం ఎక్కువగా కనుక ఉంటే ఆయా శాఖల్లో అవసరమైన ఉద్యోగులను నియమిస్తామని చెప్పారు. కొన్ని కార్యాలయాలు ప్రతిచోటా ఉండాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు.