: ఆన్‌లైన్‌లో వాహనాల విక్రయం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్ల అరెస్టు
ఆన్‌లైన్‌లో వాహనాల విక్రయం పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ల ముఠాను ఈరోజు రాచకొండ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామంటూ ముఠా చేసిన ప్రకటనకు లవీశ్‌కుమార్ అనే వ్యక్తి మోసపోయాడు. వారికి రూ.1.85 లక్షలు సమర్పించుకున్నాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. లవీశ్‌కుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సైబర్ నేరగాళ్లపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు ఎట్టకేలకు వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.