: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఇచ్చిన గిఫ్ట్ చూసి భయంతో పెద్దగా అరిచిన శిల్పాశెట్టి!
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటించిన ‘శివాయ్’ మూవీ పబ్లిసిటీలో భాగంగా ముంబయిలో సూపర్ డ్యాన్సర్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, కొరియోగ్రాఫర్ గీతా కపూర్, అనురాగ్ బసులు జడ్డిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో శిల్పా శెట్టికి అజయ్ ఓ గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ బాక్స్ లో ఏముందని తెరచి చూసిన శిల్పాశెట్టి అందులో ఉన్న బొద్దింకలను చూసి పెద్దగా కేకలు పెట్టింది. బాక్సులో ఉన్న బొద్దింకల గుంపును ఒక్కసారిగా చూడడంతో భయంతో పాటు షాక్‌కు గురయింది. వెంటనే వేదిక మీది నుంచి వెళ్లిపోయి, కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత తేరుకుంది. అనంతరం రియాల్టీ షోలో జడ్జిగా మళ్లీ పాల్గొంది. అయితే, బాక్సులో ఉన్నవి నిజమైన బొద్దింకలు కావని, బొద్దింకల బొమ్మలే అని షో నిర్వాహకులు తాపీగా చెప్పడం కొసమెరుపు!