: జమ్మూకశ్మీర్ లో ఉధంపూర్ వద్ద లోయలో పడిన బస్సు
జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ వద్ద బస్సు లోయలో పడింది. రోడ్డుపై నుంచి లోయలోకి బస్సు పల్టీలు కొట్టడంతో, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో 50 మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను హుటాహుటీన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.