: గవర్నర్ తో కేసీఆర్ భేటీ.. కొత్త జిల్లాలపై వివరించిన సీఎం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్... గవర్నర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై గవర్నర్ కు వివరాలను వెల్లడించారు. అంతేకాదు, సద్దుల బతుకమ్మ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి ప్రతిస్పందనగా, కొత్త జిల్లాల ఏర్పాటు పాలనాపరంగా మంచి నిర్ణయమని ముఖ్యమంత్రిని గవర్నర్ ప్రశంసించారు. బతుకమ్మ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని కేసీఆర్ కు హామీ ఇచ్చారు.