: సింధుకు మరో కానుక..రెడీగో స్పోర్ట్స్ కారు బహూకరణ!


రియో ఒలింపిక్స్ లో రజత పతక విజేత పివి సింధుకు మరో కానుక లభించింది. డాట్సన్ కంపెనీ ప్రతినిధులు రెడీగో స్పోర్ట్స్ కారును ఈరోజు ఆమెకు బహూకరించారు. విజయవాడలోని ఎనికేపాడులోని లక్కీ నిస్సాన్ షోరూమ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధును కంపెనీ ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, కానుక అందజేసిన కంపెనీకి కృతఙ్ఞతలు తెలుపుతున్నానని, ఏకాగ్రత, పట్టుదల అలవరచుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పింది. నిస్సాన్ మోటార్ ప్రయివేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ మాట్లాడుతూ, తన క్రీడా ప్రతిభ ద్వారా దేశానికి పేరు తెచ్చిన సింధుకు ఈ కారును అందజేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News