: మరో పాకిస్థాన్ బోటు జప్తు.. 9 మందిని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్
పాకిస్థాన్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఇండియాలోకి ఏదో రూపంలో ప్రవేశించాలని యత్నిస్తున్నారు. అమృత్‌సర్‌లోని రావి నది వద్ద నిన్న పాకిస్థాన్‌కు సంబంధించిన ఓ బోటును సరిహద్దు భద్రతా సిబ్బంది (బీఎస్‌ఎఫ్) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు గుజరాత్ తీరంలోనూ మరో పాకిస్థాన్ బోటును భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న తొమ్మిది మంది పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు.