: 14 మంది భారత జవాన్లను మట్టుబెట్టాం: పాక్ మీడియాలో వార్తల వెల్లువ


పాకిస్థాన్ సైన్యం భారత్ లోకి దూసుకు వచ్చి జవాన్లను చిత్తు చిత్తు చేశారట. ఏకంగా 14 మందిని హతమార్చారట. బాంబుల వర్షం కురిపించారట. ఇది పాక్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. చానళ్లు, వెబ్ సైట్ల నిండా ఇదే ప్రచారం జరుగుతోంది. సర్జికల్ స్ట్రయిక్స్ పై ఎలా స్పందించాలో తెలియక, అంతర్జాతీయ దేశాల ముందు దోషిగా నిలబడలేక, పాక్ చేస్తున్న వికృత చేష్టలివి. కట్టు కథలు అల్లుకుని, వాటికి ప్రత్యేక కథనాలని పేరు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయి. భారత సైనికులపై బాంబులను కురిపించామని చెబుతూ, మార్ఫింగ్ ఫోటోలు, కల్పిత వీడియోలు ప్రసారం చేస్తున్నాయి. కాగా, పాక్ లో జరుగుతున్న ఈ ప్రచారం శుద్ధ అబద్ధమని భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. అసలు వీటిపై స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నారు.

  • Loading...

More Telugu News