: త‌ర‌చూ ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది: గ‌వ‌ర్న‌ర్ నరసింహన్


త‌ర‌చూ ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల అభివృద్ధికి ఆటంకం క‌లుగుతుంద‌ని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అన్నారు. సంవ‌త్స‌రంలో రెండుసార్లకంటే ఎక్కువ‌గా ఉపఎన్నిక‌లు జ‌రగ‌కుండా ఉంటే బాగుంటుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు క‌నుగొనాలని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ అధికారుల‌కు ఆయ‌న సూచించారు. ఎన్నిక‌లు మ‌రింత‌ పార‌ద‌ర్శ‌కంగా నిర్వహించేలా చూడాలని ఆయ‌న సూచించారు. లోక్‌స‌భ‌, శాస‌న‌స‌భ‌, స్థానిక సంస్థ‌ల‌కు ఒకే ద‌ఫా ఎన్నిక‌లు నిర్వహిస్తే బాగుంటుంద‌ని అన్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా డ‌బ్బులు పంచే చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు.

  • Loading...

More Telugu News