: తొలి గూగుల్ ఫోన్ పిక్సెల్ వచ్చేసింది... స్పెసిఫికేషన్స్, ధర వివరాలివి!


గూగుల్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ప్రపంచవ్యాప్తంగా భారత సహా ఆరు దేశాల్లో విడుదల కానున్న గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ ఎల్ వేరియంట్లను శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన భారీ ఈవెంట్ లో గూగుల్ చూపింది. ఇండియాలో ఈ నెల 13 నుంచి ముందస్తు ఆర్డర్లు మొదలవుతాయని, నెలాఖరులోగా ఫోన్ డెలివరీలను ప్రారంభిస్తామని గూగుల్ తెలిపింది. ఇక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని స్మార్ట్ ఫోన్ కు పరిచయం చేస్తున్న ఈ ఫోన్ ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి భారత కరెన్సీలో రూ. 43 వేల నుంచి రూ. 58 వేల వరకూ ఉంటుంది. పిక్సెల్ వేరియంట్ లో 5 అంగుళాల స్క్రీన్, పిక్సెల్ ఎక్స్ ఎల్ లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో లభించే అమోలెడ్ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ రామ్, 12.3 / 8 ఎంపీ కెమెరాలు, యూఎస్బీ టైప్-సీ పోర్టు తదితర ఫీచర్లతో లభిస్తుంది. గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ 7.1 నోగాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇక ధరల విషయానికి వస్తే, పిక్సెల్ (32 జీబీ) ధర అమెరికాలో 649 డాలర్లు (సుమారు రూ. 43 వేలు). 128 జీబీ వేరియంట్ ధర 749 డాలర్లు (సుమారు రూ. 50 వేలు). పిక్సెల్ ఎక్స్ ఎల్ (32 జీబీ) ధర రూ. 769 డాలర్లు (సుమారు రూ. 51 వేలు). 128 జీబీ వేరియంట్ ధర 869 డాలర్లు (సుమారు ర. 58 వేలు). ఇండియాకు దిగుమతి అయ్యే సరికి ఈ ధరలు మరికాస్త పెరగవచ్చు.

  • Loading...

More Telugu News