: గ్యాస్‌కు ఆధార్ తప్పనిసరి.. కేంద్ర చమురు, పెట్రోలియం శాఖ ఉత్తర్వులు జారీ
దేశంలో అమలులో ఉన్న పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరిని చేసి అక్రమాలను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ కార్డు జత చెయ్యాలని ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, వచ్చేనెల 30 నుంచి ఆధార్ లేకపోతే ఎల్పీజీ రాయితీ సిలిండర్లు ఇవ్వబోమని కేంద్ర చమురు, పెట్రోలియం శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ కార్డు ఇంతవరకూ పొందలేని వారు రెండు నెలల్లోగా తీసుకొని సమర్పించాలని పేర్కొంది. నవంబరు 30వ తేదీలోపు ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సిందేనని చెప్పింది.