: అమ్మవారి ఆశీస్సులతో అత్యుత్తమ క్రికెట్ జట్టును ఎంపిక చేస్తా: ఇంద్రకీలాద్రిపై ఎమ్మెస్కే ప్రసాద్


దసరా శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనం ఇస్తున్నారు. భ‌క్తుల రద్దీ అధికంగా ఉంది. ఇటీవ‌లే టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికైన తెలుగుతేజం ఎమ్మెస్కే ప్రసాద్ ఈరోజు ఉద‌యం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామివారిని ద‌ర్శించుకొని, పూజ‌ల్లో పాల్గొన్నారు. ఆయ‌న‌కు దేవాల‌య అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంత‌రం ఎమ్మెస్కే ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ... దుర్గమ్మ‌వారి ఆశీస్సులతో అత్యుత్తమ క్రికెట్‌ జట్టును ఎంపిక చేస్తానని పేర్కొన్నారు. మ‌రోవైపు రాష్ట్ర మంత్రి చినరాజప్ప దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News