: కాన్పూర్‌లో 3 రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం.. ఆయుధాలతో బెదిరించి దోచుకున్న వైనం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈరోజు తెల్లవారుజామున 3 రైళ్లలోకి చొరబడిన దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆయుధాలతో బెదిరించి ప్రయాణికుల నుంచి నగదు, బ్యాగులతో పాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. దొంగలు పలువురు ప్రయాణికులను గాయపరిచారని పోలీసులు తెలిపారు. వైశాలి ఎక్స్‌ప్రెస్, లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, మరో రైలులో ఈ దోపిడీ జరిగిందని చెప్పారు. ప్రయాణికుల్లో చాలామంది ఆ సమయంలో నిద్రిస్తుండగా మూడు రైళ్లలోకి ఒకేసారి ప్రవేశించిన దుండగులు తమ పని పూర్తి చేసుకొని వెంటనే అక్కడినుంచి పరారయ్యారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.