: ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మంతెన పాఠాలు


అమరావతికి సమీపంలోని కేఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న మూడు రోజుల తెదేపా శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలకు యోగా, ఆహార నియమాలపై శిక్షణ ప్రారంభమైంది. ప్రకృతి వైద్య నిపుణుడు మంతెన సత్యనారాయణరాజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా నేతలంతా పాల్గొని ఆయన పాఠాలను వింటున్నారు. ఉదయం అల్పాహారం ఎలా ఉండాలి? మధ్యాహ్న భోజనంలో ఏం తీసుకోవాలి? రాత్రి ఎంత మితాహారమైతే మేలు? వంటి విషయాలను ఆయన వెల్లడించారు. అంతకుముందు, ఉదయం వీరికి యోగా తరగతులు కూడా జరిగాయి. యోగా, ఆహార నియమాలతో మరింత ఉత్సాహంగా, శ్రద్ధగా విధుల్లో పాల్గొనవచ్చని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News