: ఏఎన్‌ 32 విమానం ఆచూకీ కనిపెట్టలేకపోయాం...వెతుకులాట విరమించేశాం: అధికారిక ప్రకటన


గత జూలై 22న తమిళనాడులోని తాంబరం ఎయిర్‌ బేస్‌ నుంచి పోర్ట్ బ్లెయిర్‌ కు బయల్దేరిన ఏఎన్‌ 32 విమానం బంగాళాఖాతంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి, రిమోట్‌ కంట్రోల్‌ తో పని చేసే అండర్‌ వాటర్‌ వెహికల్‌ తో (ఆర్‌వోవి) 15 ప్రాంతాల్లో నేవీ తీవ్రంగా గాలించింది. ఈ సుదీర్ఘ గాలింపులో ఏఎన్‌ 32 విమానం ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో గాలింపు చర్యలను ఆపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

  • Loading...

More Telugu News