: ఆ యువతి నా వెంట ఎందుకు పడిందో నాకు తెలియదు: టెన్నిస్ ప్లేయర్ ఆండీ ముర్రే


యూరప్ లోని ఒక హోటల్ గదిలో ఒక యువతి తన వెంట పడిందని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆండీ ముర్రే చెప్పాడు. టోర్నమెంట్ నిమిత్తం అక్కడి హోటల్ గదిలో బస చేసిన సమయంలో జరిగిన ఈ సంఘటనను ముర్రే ప్రస్తావిస్తూ... తన గదికి ‘డోన్ట్ డిస్టర్బ్’ అనే బోర్డు తగిలించి పడుకోవడానికి వెళ్లానని చెప్పాడు. మర్నాడు ఉదయం 7 గంటల సమయంలో ఒక యువతి తన గదిలోకి వచ్చి చేయి పట్టుకుని తట్టిందని అన్నాడు. గతంలో తాను వెళ్లిన రాటర్ డామ్, బార్సిలోనా టోర్నమెంట్లకు కూడా ఆ యువతి తనను ఫాలో అయిందని, ఆ యువతి తనను ఎందుకు ఫాలో చేస్తున్నదో మాత్రం తెలియడం లేదని ముర్రే చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News