: పద్దెనిమిదేళ్ల యువకుడికి 18 సెం.మీ. తోక .. తొలగించిన వైద్యులు


మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఒక వ్యక్తి జన్యుపరమైన లోపం కారణంగా వీపు వెనుక తోకతో జన్మించాడు. అతని వయసుతో పాటు తోక కూడా పెరిగింది. ప్రస్తుతం అతని వయసు 18 సంవత్సరాలు కాగా, అతని తోక పొడవు 18 సెంటీమీటర్లు. ఈ తోక కారణంగా వెన్నుముక నొప్పితో బాధపడుతుండే వాడు. ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు గత వారం నాగపూర్ లోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ యువకుడిని పరిశీలించిన వైద్యులు, అతనికి శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. ఈ సందర్భంగా యువకుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ, పుట్టుకతోనే తమ కుమారుడికి తోక వచ్చిందని, వైద్యులను సంప్రదించే విషయంలో కొంత నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. అయితే, అతని వయసుతో పాటు తోక కూడా పెరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వెంటనే వైద్యులను సంప్రదించామన్నారు.

  • Loading...

More Telugu News