: దుర్గగుడి అమ్మవారికి నైవేద్యం జాప్యం..ఆలయ సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు


విజయవాడ దుర్గ గుడి అమ్మవారికి నైవేద్యం ఆలస్యం కావడంపై ఆలయ ఈవో సూర్యకుమారి సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో నైవేద్యం సమయంలో విధుల్లో ఉన్న ఆలయ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు. ఏఈఓ, ఇన్ స్పెక్టర్ కు షోకాజ్ నోటీస్ లు జారీ చేశారు. కాగా, దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో ఈగలు, పురుగులు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ అధికారులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఈరోజు అమ్మవారి అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి భక్తులతో కొంచెం సేపు మాట్లాడారు. అమ్మవారికి నైవేద్యం ఆలస్యమైన విషయమై విచారణ జరిపిస్తానని ఈరోజు ఉదయం ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News