: యూపీలో 250 మంది కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో కిసాన్ యాత్ర పేరిట రోడ్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల రీత్యా ఈరోడ్ షోలో పాల్గొనేందుకు 250 మంది కాంగ్రెస్ నేతలకు పోలీసులు అనమతించలేదు. అయినప్పటికీ, ఆయా ర్యాలీల్లో పాల్గొన్న 250 మంది కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు మొరాదాబాద్ పోలీసులు తెలిపారు. కాగా, కిసాన్ యాత్ర పేరిట 2,500 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దాదాపు 223 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.