: రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. డాషింగ్ ఓపెనర్ గేల్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. రాజస్థాన్ ఆల్ రౌండర్ వాట్సన్ 3 మూడు వికెట్లతో సత్తా చాటాడు.