: సైనికులపై మీ వ్యాఖ్యలకు విచారిస్తున్నా: ఓంపురి తీరుపై అనుపమ్ ఖేర్
బారాముల్లా, యూరీ సెక్టార్ ఘటనల్లో వీర మరణం పొందిన భారత జవాన్లపై బాలీవుడ్ నటుడు ఓంపురి చేసిన వ్యాఖ్యలపై మరో నటుడు అనుపమ్ ఖేర్ విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘మీరంటే నాకు చాలా గౌరవం. ఈరోజు టీవీలో మీరు సైనికులపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం నేను విచారిస్తున్నాను’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ఒక టీవీ ఛానెల్ లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న ఓంపురి ఈ వ్యాఖ్యలు చేశారు. వీరమరణం పొందిన సైనికుల గురించి ప్రశ్నించగా, ఆ సైనికులను ఆర్మీలో చేరమని, ఆయుధం పట్టమని ఎవరు కోరారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి.