: సర్జికల్ స్ట్రయిక్స్ లాంటి దాడే 2013 జనవరిలోనూ చేశాం.. కానీ, ప్రజల్లోకి తీసుకెళ్లలేదు: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం


నియంత్ర‌ణ రేఖ‌ను దాటి భార‌త సైన్యం పీవోకేలో జ‌రిపిన సర్జికల్ స్ట్రయిక్స్పై ప్ర‌తిప‌క్షాలు భిన్న‌రీతిలో స్పందిస్తున్నాయి. రాహుల్ గాంధీ నుంచి కేజ్రీవాల్ వ‌ర‌కు ప్ర‌ధాని మోదీని ప్ర‌శంసించిన సంగతి తెలిసిందే. అదే స‌మ‌యంలో ఆ దాడుల‌కు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం స్పందిస్తూ.. భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటి దాడులు చేయ‌డం ఇది మొద‌టిసారేం కాద‌ని అన్నారు. ఇటువంటి దాడే 2013 జనవరిలో త‌మ ప్ర‌భుత్వ‌ హయాంలో జరిగిందని ఆయ‌న పేర్కొన్నారు. కానీ, ఆ దాడిని యూపీఏ ప్రజల్లోకి తీసుకెళ్లలేద‌ని చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భార‌త‌ ఆర్మీ జరిపే దాడుల‌కు ఎన్డీఏ సర్కారుకి తామందరమూ మ‌ద్ద‌తుగా నిలుస్తామని అన్నారు. అయితే, సైన్యం తీసుకుంటున్న చర్యలకు తగిన ఆధారాలు వెల్ల‌డించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News