: క‌ర‌వు ప‌రిస్థితిని తెలుసుకోవ‌డానికి మీ కంప్యూట‌ర్లు ప‌నిచేయ‌డం లేదా?: చ‌ంద్ర‌బాబుపై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు


ఒక్క అనంత‌పురం జిల్లాలోనే దాదాపు 16 ల‌క్ష‌ల ఎక‌రాల వేరుశ‌న‌గ వేశారని వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. రైతు సమస్యలపై అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆయ‌న‌ ధ‌ర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... అనంత‌పురంలో దాదాపుగా మ‌రో మూడు ల‌క్ష‌ల ఎక‌రాలు వేరే పంట‌లు వేశారని అన్నారు. 90 శాతం వేరుశ‌న‌గ పంట ఎండిపోయిందని అన్నారు. రాయ‌ల‌సీమంతా క‌లిపి దాదాపు 21లక్ష‌ల‌ 55వేల ఎక‌రాల్లో వేరుశ‌న‌గ పంట వేశారని చెప్పారు. అనంత‌పురంలో ఆగ‌స్టు చివ‌రి వ‌ర‌కు వ‌ర్షాలు లేవని జ‌గ‌న్ అన్నారు. ‘రైతులు ఎంతో పంటని న‌ష్టపోతే ఆగ‌స్టు 28న చంద్ర‌బాబు నాయుడు పుట్ట‌ప‌ర్తికి వ‌చ్చారు.. క‌ర‌వు ఉందా? నాకు తెలీదే, నాకు చెప్ప‌లేదే అని చంద్ర‌బాబు అన్నారు. జిల్లాలో క‌ర‌వు ప‌రిస్థితి అలాగే ఉంది. వ‌ర్షాలు కూడా లేవు. వ‌ర్షాలు ప‌డితే కానీ పంట పండ‌ని ప‌రిస్థితి ఆరోజు ఉంది. క‌ర‌వు ప‌రిస్థితిని తెలుసుకోవ‌డానికి మీ కంప్యూట‌ర్లు ప‌నిచేయ‌డం లేదా? కంప్యూట‌ర్ ద్వారా ప్ర‌పంచ‌ంలోని అన్ని విష‌యాలు తెలుస్తాయ‌ని ఓ ప‌క్క చెబుతుంటారు. మ‌రోప‌క్క క‌ర‌వు ప‌రిస్థితి తెలియ‌లేదు అంటున్నారు. ఓ ప‌క్క క‌ర‌వు ఉంటే మ‌రోప‌క్క‌ యుద్ధం చేశామ‌ని చెప్పుకున్నారు. క‌ర‌వు లేకుండా వెళ్లిపోయింద‌ని చెబుతున్నారు. ప‌బ్లిసిటీ పిచ్చి ఎక్కువ‌యి సిగ్గు లేకుండా ఎన్నో ఎక‌రాల‌కు నీరందించామ‌ని చెబుతున్నారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News