: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
తెలంగాణ సర్కారు మరికొన్ని రోజుల్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించాలని తుది చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. పలువురు నేతలతో కలిసి ఈరోజు అక్కడకు చేరుకున్న ఆయన హుజుర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.