: మా కుటుంబంతో సమంత బాగా కలిసిపోయింది: నాగ చైతన్య


తమ కుటుంబంతో సమంత బాగా కలిసిపోయిందని యువనటుడు నాగ చైతన్య అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, సమంత, తాను ఒకేసారి సినిమాల్లోకి ప్రవేశించామని, దీంతో.. ప్రతి విషయాన్ని ఇద్దరం పంచుకున్నామని చెప్పాడు. ‘మనం’ చిత్రం అప్పటి నుంచే సమంత తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందని, అదేవిధంగా, తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా సమంతను తాము చూస్తామని చెప్పాడు. ఇద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారనే విషయమై నాగ చైతన్య మాట్లాడుతూ, ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని, ‘ఏ మాయ చేశావే!’ చిత్రం అప్పటి నుంచి తామిద్దరం ఫ్రెండ్సేనని అన్నాడు.

  • Loading...

More Telugu News