: యాక్షన్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం: నాగ చైతన్య
యాక్షన్ చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ యువ నటుడు నాగచైతన్య అన్నాడు. నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘ప్రేమమ్’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ, మలయాళ చిత్రమైన ‘ప్రేమమ్’ను మన నేటివిటీకి తగ్గట్లుగా తీశామని, ఈ చిత్రం మ్యూజికల్ హిట్ కూడా అయిందని అన్నాడు. ఒక నటుడు విభిన్న పాత్రల్లో నటిస్తుండాలని, లేకపోతే బోర్ కొడుతుందని అన్నాడు. చిన్నప్పటి నుంచి తాను యాక్షన్ చిత్రాలు చూసి పెరిగానని, అందుకే, ఆ చిత్రాలంటే తనకు ఇష్టమని, ఆ తరహా చిత్రాల్లో ఒక సూపర్ హిట్ కొట్టాలని ఉందని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.