: ఈడెన్ టెస్టులో రికార్డు సాధించిన వృద్ధిమాన్ సాహాకే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'


భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మరో ఒకరోజు ఆట మిగిలి ఉండగానే న్యూజిలాండ్ టీమ్ వెన్ను విరిచిన టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించి వృద్ధిమాన్ సాహా అజేయంగా నిలిచాడు. తద్వారా ఆయన రికార్డు కూడా నెలకొల్పిన విషయం విదితమే. బౌల‌ర్ల‌కు అనుకూలించిన మైదానంలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి రాణించిన కీపర్ సాహా రెండో టెస్టులో మొదటి ఇన్సింగ్స్ లో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిస్తే, రెండో ఇన్సింగ్స్‌లోనూ 58 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆయ‌నను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వ‌రించింది.

  • Loading...

More Telugu News