: ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎల్లప్పుడూ విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు కూడా ఇటీవల పీవోకేలో భారత సైన్యం ఉగ్ర స్థావరాలపై చేసిన సర‍్జికల్ దాడుల తరువాత ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇటీవలే మోదీ తొలిసారి మంచి పనిచేశారంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా మోదీని పొగిడారు. తాము పలు విషయాల్లో ప్రధానితో విభేదించినా.. పీవోకేలో సర‍్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మోదీ చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్నట్లు కేజ్రీ పేర్కొన్నారు. భారత సైన్యం తీసుకున్న చర్యను తాము పూర్తిగా సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన సైనికులు దాడులకు దిగిన తరువాత పాక్ ఆర్మీ ఆ అంశంపై చేస్తున్న అసత్యప్రచారాన్ని భారత్ ఎండగట్టాలని మోదీకి తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.