: క్షేమంగా తప్పించుకున్న బారాముల్లా ఉగ్రవాదులు... ఆరు గంటలు వెతికి వదిలేసిన సైన్యం
దాదాపు ఆరు గంటల సెర్చ్ ఆపరేషన్ అనంతరం, నిన్న రాత్రి బారాముల్లాలోని 46 రాష్ట్రీయ రైఫిస్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన ఉగ్రవాదులు తప్పించుకున్నారని, వారి కోసం మొదలుపెట్టిన వెతుకులాటను విరమిస్తున్నామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. వారు జీలం నదిలో పాక్ చేరుకున్నట్టు నమ్ముతున్న మీదటే, సోదాలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. "మిలిటెంట్లు ఆత్మాహుతి దాడి లక్ష్యంతోనే వచ్చారు. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లతో వచ్చారు. అయితే, 46 ఆర్ఆర్ లోపలికి వెళ్లడంలో విఫలమయ్యారు. వారిని ముందే గుర్తించిన భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. దీంతో లోపలి ప్రవేశించలేక వారు పలాయనం చిత్తగించారు. వారికోసం ఆరు గంటలు వెతికాం. ఆచూకీ చిక్కలేదు. ఇక సోదాలు ఆపివేసి, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ను పునరుద్ధరించాము" ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.