: పోర్చుగల్ వీధుల్లో డ్యాన్స్ చేసిన బాలీవుడ్ భామ అనుష్క శర్మ


ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ద రింగ్‌’ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం యూర‌ప్‌లో కొన‌సాగుతోంది. ఇందులో షారుఖ్‌, అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లలో న‌టిస్తున్నారు. అయితే, అనుష్క‌శ‌ర్మ పోర్చుగల్‌లోని లిస్బెన్‌ వీధుల్లో లైవ్‌ మ్యూజిక్‌ వేడుకలో డ్యాన్స్ చేస్తూ క‌నిపించింది. అనంత‌రం అక్క‌డ తాను డ్యాన్స్ చేస్తుండ‌గా తీసిన వీడియోను సోష‌ల్‌మీడియాతో పోస్ట్ చేసింది. ఆమె వీధుల్లో అలా డ్యాన్స్ చేయ‌డం చూసిన ఆమె అభిమానులు ఆ వీడియోను ఎంతో ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. షూటింగ్‌లతో బిజీబిజీ ఉండే అనుష్క‌శ‌ర్మకు కాస్త విశ్రాంతి దొరికితే చాలు, ఆ స‌మ‌యాన్నంతా ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటుంది. అందుకే వీధుల్లోకొచ్చి ఓ డ్యాన్సర్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. షారుఖ్‌ ఖాన్ న‌టించిన‌ ‘రబ్‌ నే బనాదీ జోడీ’ సినిమా(2008) తో సినీరంగ ప్ర‌వేశం చేసిన అనుష్క‌శ‌ర్మ మ‌రోసారి ఇప్పుడు ‘ద రింగ్‌’ సినిమాలో మ‌ళ్లీ ఆయ‌న‌తో జ‌త‌క‌ట్టింది.

  • Loading...

More Telugu News