: ఇబ్రహీంపట్నంలో సెల్ఫోన్ కలకలం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల వరుసగా జరిగిన పేలుళ్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం స్కూటర్ డిక్కీలో భారీ శబ్దంతో పేలుడు సంభవించగా, నిన్న అంబేద్కర్ చౌరస్తా దగ్గర పూల మార్కెట్ వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆ ప్రాంతంలోని రిలయన్స్ స్టోర్ వద్ద ఓ మహిళ సెల్ఫోన్ వదిలి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో భయాందోళనలు వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి బాంబు స్క్వార్డ్ తో చేరుకొని తనీఖీ చేస్తున్నారు.