: మూడేళ్లకే లక్ష్మీ కటాక్షం... బుల్లి బిలియనీర్!


ఓ కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత కాలం పడుతుంది? అదృష్టవంతులైతే తల్లిదండ్రుల నుంచి ఆస్తి రావచ్చు. బాగా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేసే వారికైతే మూడు పదుల వయసులో కోటీశ్వరులు కావచ్చు. కానీ లక్ష్మీదేవి కటాక్షం ఉంటే... ఒక్క రోజులో ధనవంతులు అయిపోవచ్చు కూడా. కానీ, మూడేళ్ల వయసులో బిలియనీర్ కావాలంటే... అది ఈ బుడతడి విషయంలోనే సాధ్యమైంది. వీడు న్యూజిలాండ్ లో పుట్టాడు. పుట్టగానే, అతని మావయ్య 'బోనస్ బాండ్స్' ఖాతాను తెరువగా, తాజా లక్కీ డిప్ లో ఈ పిల్లాడి పేరు వచ్చింది. ఇంకేం, మొత్తం రూ. 4,83,72,961 (దాదాపు 7.20 లక్షల డాలర్లు) సొంతమైంది. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు ఈ చిన్నారి తల్లిదండ్రులు. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున పుట్టిన తమ బిడ్డకు దేవుడి ఆశీర్వాదంతో ఇంతటి అదృష్టం వరించిందని చెప్పుకుంటున్నారు. బోనస్ బాండ్స్ లక్కీ డిప్ ఇంత చిన్న కస్టమర్ కు రావడం ఇదే తొలిసారట.

  • Loading...

More Telugu News