: హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియన్ పై దుండగుల దాడి


హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ పై దుండగులు దాడి చేశారు. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఆమె హోటల్ లో బస చేసిన వేళ, పోలీసు దుస్తులు, ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన దుండగులు ఆమెకు తుపాకులు చూపి బెదిరించారు. ఈ ఘటనతో ఆమె భయంతో వణికిపోయిందని కిమ్ తరఫు ప్రతినిధి ఇనా ట్రెకియోకాస్ తెలిపారు. కాగా, ఆమె నుంచి డబ్బు, నగలు ఏమైనా దోచుకుని వెళ్లారా? అన్న విషయం తెలియరాలేదు. ఈ వార్త తెలుసుకున్న ఆమె భర్త కాన్ యె వెస్ట్, న్యూయార్క్ లోని సిటీ ఫీల్డ్ లో తాను పాల్గొంటున్న మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ ప్రదర్శనను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయాడు. తన కుటుంబ సమస్య కారణంగా షో నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు.

  • Loading...

More Telugu News