: అసౌకర్యంగా ఉంటుందంటూనే ఐటెం సాంగ్స్‌కు రెడీ అంటున్న రాశిఖన్నా


ఐటెంసాంగ్స్‌లో నటించడం తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందంటూనే అవకాశం వస్తే మాత్రం వదులుకోబోనని తెగేసి చెబుతోంది రాశీఖన్నా. హీరో రామ్‌తో కలిసి ఆమె నటించిన ‘హైపర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాశీ విలేకరులతో మాట్లాడింది. ఐటెంసాంగ్స్‌లో నటించడమంటే కొంత అసౌకర్యంగానే ఉంటుందని పేర్కొంది. అయితే ఎవరైనా తమ సినిమాలో ఆఫర్ చేస్తే మాత్రం తప్పకుండా అంగీకరిస్తానని పేర్కొంది. ‘సుప్రీం’ సినిమాలో బెల్లం శ్రీదేవిలా కనిపించిన, రాశి ‘హైపర్’ సినిమాలో భానుమతి పాత్ర పోషించింది. బాలీవుడ్‌కు వెళ్లాలన్న ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని పేర్కొంది. అయితే అవకాశం వస్తే మాత్రం ఆలోచిస్తానని చెప్పిందీ ముద్దుగుమ్మ. హైపర్ సినిమాలో తన పాత్రకు కాస్త కామెడీ జోడించారని, దీంతో కెమెరా ముందు నటన మరింత సులభమైందని రాశీ వివరించింది.

  • Loading...

More Telugu News