: ఆ షూటింగ్ సమయంలో ‘గొల్లపూడి’ నన్ను కొట్టింది వాస్తవమే: నటి పూర్ణిమ


గతంలో సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనను కొట్టిన విషయం వాస్తవమేనని ఒకప్పటి కథానాయిక పూర్ణిమ అన్నారు. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ‘ముద్దమందారం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన నాటి నటి పూర్ణిమ. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మనిషికో చరిత్ర’. ఈ చిత్రంలో గొల్లపూడి మారుతీరావుగారికి కూతురి పాత్రలో నటించాను. మా ఇద్దరి మధ్య షూట్ చేయాల్సిన ఒక సన్నివేశం కోసం రిహార్సల్ చేశాం. అందులో పర్ ఫెక్ట్ గా చేశాను. అయితే, షూట్ చేసే సమయానికి మాత్రం నేను చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోతున్నాను. ఇలా, చాలా టేక్ లు తీసుకున్నాను. ఆ సమయంలోనే గొల్లపూడి నా చెంపపై కొట్టారు. నేను కిందపడిపోయాను. నా ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేశారు. ఆ తర్వాత, అక్కడే ఉన్న మా నాన్నగారు, ఈ విషయంపై గొల్లపూడితో గొడవకు దిగారు’ అని పూర్ణిమ నాటి విషయాలను గుర్తు చేసుకుంది.

  • Loading...

More Telugu News