: ‘గాంధీ జయంతి శుభాకాంక్షలతో ..ఓం శాంతిః ‘వంగవీటి’ ట్రైలర్ విడుదల’: దర్శకుడు వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నచిత్రం ‘వంగవీటి’. ఈ చిత్రం ట్రైలర్ ను ఆయన ఈరోజు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఈ ట్రైలర్ ను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘భయపడే వాడెవ్వడూ రౌడీ అవ్వలేడు’ అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కాగా, ‘వంగవీటి’ టైటిల్ కి ‘కాపు కాసే శక్తి’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ సినిమా ‘గాంధీ జయంతి శుభాకాంక్షలతో నేటి సాయంత్రం 5 గంటలకి ట్రైలర్ విడుదల..ఓం శాంతిః’ అంటూ వర్మ పోస్ట్ చేశారు. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ను వర్మ నిన్న విడుదల చేశారు.