: ‘చంద్రన్న బీమా’ పథకం ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతం: సీఎం చంద్రబాబు


‘చంద్రన్న బీమా’ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి రోజున ఈ పథకాన్ని ప్రారంభిస్తుండటం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. పేదవారి సంక్షేమ కోసమే అనునిత్యం పని చేయాలన్నదే తన జీవితాశయం అని అన్నారు. రాష్ట్రమే తన కుటుంబమని, ప్రతి కుటుంబానికి తాను అండగా ఉంటానని అన్నారు. 2 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఈ బీమా పథకం వర్తిస్తుందన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అత్యంత అవసరమని, రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని గ్రామాలు, ఇళ్లు ఉండకూడదని, ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసమే మరుగుదొడ్ల కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News