: ఎవరి భూభాగాలను లాక్కోవాలని భారత్ చూడదు: ప్రధాని మోదీ


ఎవరి భూభాగాల జోలికి భారత్ వెళ్లదని, అలా అని చెప్పి, ఎవరైనా మన దేశంపై దాడి చేసేందుకు వస్తే చూస్తూ ఊరుకోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రవాస భారతీయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్ తనంతట తానుగా మరో దేశంపై దాడి చేయాలని ఎప్పుడూ చూడదని అన్నారు. పాకిస్థాన్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత రెండేళ్లలో చూస్తే ప్రభుత్వం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది భారతీయులను, విదేశీయులను రక్షించిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రవాసభారతీయుల గురించి ప్రస్తావిస్తూ, 150 దేశాల్లో భారతీయులు ఉన్నారని, వాళ్లు నీళ్ల లాంటి వారని, అక్కడి పరిస్థితులను అనుసరించి వాళ్లను వాళ్లు మార్చుకుంటారని మోదీ కొనియాడారు.

  • Loading...

More Telugu News