: అలాంటి పాత్రల కోసం నేనేమీ ప్లాన్ చేసుకోలేదు: రాధికా ఆప్టే
విభిన్నపాత్రల్లో నటించాలని ముందు నుంచే తానేమీ ప్లాన్ చేసుకోలేదని.. తన నటనను చూసి అలాంటి పాత్రలు వాటంతట అవే వస్తున్నాయని అందాల కథానాయిక రాధికా ఆప్టే చెప్పింది. తనకు నచ్చిన పాత్రలు చేస్తుంటానని, ముఖ్యంగా వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్రలు మాత్రమే చేస్తుంటానని చెప్పింది. అయితే, ఒక విషయం గుర్తుంచుకోవాలని, ఏదైనా సినిమాలో మన నటన బాగుంటే, ఆ తర్వాత చిత్రాల్లో కూడా అదే తరహా పాత్రలు లభిస్తాయని చెప్పింది. కానీ, తనకు ఒకే విధమైన పాత్రల్లో నటించడం ఇష్టముండదని రాధికా ఆప్టే పేర్కొంది.